యోగా అంటే ఏమిటి? ‘యోగా థెరపీ’ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా?

ఇప్పుడు ఎక్కడ విన్నా యోగా ..యోగా అని వినపడుతోంది. కాస్త ఒళ్లు ఉంటే..యోగా కు వెళ్లి తగ్గచ్చుగా అంటున్నారు. సుగర్ వచ్చింది..బీపీతో బాధపడుతున్నాను అంటే యోగా క్లాస్ లుకు వెళ్తే సెట్ అవుతుంది కదా అని సలహాలు ఇస్తున్నారు. నిజంగా యోగాలో అంత గొప్పతనం ఉందా. అసలు యోగా అంటే ఏమిటి,యోగా వలన కలిసి వచ్చేదేమోనా ఉందా..లేక టైమ్ వేస్ట్ వ్యవరహారమా వంటి విషయాలు చూద్దాం.  యోగా అంటే ..   వరల్డ్ యోగా అండ్ ఆరోగ్య కన్వెన్షన్‌కు కోఆర్డినేటర్‌గా ఉన్న యోగా థెరపిస్ట్ గిరీష్ కుమార్ మోరేశ్వర్ యోగా అంటే ఏంటో ఇలా వివరిస్తున్నారు …యోగా అంటే కలయిక. జీవాత్మను, పరమాత్మను కలిపేదే యోగా. మైండ్ అండ్ బాడీని సమన్వయం చేస్తుంది. యోగా అనేది నాట్ ఏ ఫిజికల్ వర్క్. యూజ్ అనే పదం నుంచి వచ్చిందే యోగా. ఎక్సర్‌సైజ్‌కు, యోగాకి చాలా తేడా ఉంటుంది.  ఎందుకంటే ఎక్సర్‌పైజ్ అనేది ఒక పరికరంపై గానీ వస్తువుతో గానీ ఆయాసం వచ్చే వరకు చేస్తారు. యోగా అలా కాదు పూర్తిగా బ్రీతింగ్ పైన కంట్రోల్ ఉంచాలి. ఈ రోజుల్లో ప్రతి పనిలో ఒత్తిడి ఉంటుంది. దీన్ని అధిగమించడానికి అల్టిమేట్ పరిష్కారం యోగా. ఇదే విషయాన్ని మనసు, శరీరాన్ని అనుసంధానం చేసే ప్రక్రియనే యోగా. అంతేకానీ.. యోగా మనసు, శరీరాన్ని అదుపు చేయదు. ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎలాంటి రుగ్మతలు రాకుండా, లేకుండా చేస్తుంది. పరిసరాలు, పరిస్థితులను కలుపుకొని బతకడం ఎలాగో నేర్పిస్తుందీ యోగా అని చెప్తున్నారు.  యోగా అనేది ఒక వ్యాయామ పద్ధతి కాదు, అది మనిషిని తను చేరుకోగల అత్యునత్త స్థితికి చేరవేసే ఒక సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం. అసలు ‘యోగా’ అంటే ‘ఐక్యం’ అని అర్థం . మీరు అన్నిటితో ఐక్యం అయితే, అదే యోగా! అయితే అన్నీ ఒకటి ఎలా కాగలవు? అని ప్రశ్నిస్తారు ఇషా ఫౌండేషన్ సద్గురు. 
 ‘యోగా థెరపీ’ ఈ మాట  గత కొంతకాలంగా  విస్తృతంగా ప్రాచుర్యంలోకి వస్తోంది. యోగాను ప్రత్యామ్నాయ చికిత్సా విధానంగానో, మిగతా వైద్యాలకు అనుబంధ చికిత్సగానో ఆమోదించే వైద్యుల సంఖ్యా పెరుగుతోంది. యోగా జీవనవిధానంలో ఓ భాగమైతే చిన్నాచితకా అనారోగ్యాలు కూడా నీ దరిదాపుల్లోకి రాలేవు. యోగా రోగనిరోధక శక్తిని పెంచుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ మియామీలోని టచ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశీలనలో వెల్లడైంది. వెన్నెముక సమస్యలకు యోగాలో పరిష్కారం ఉందని బెంగళూరులోని వివేకానంద యోగా విశ్వవిద్యాలయం నిరూపించింది.  క్యాన్సర్‌ రోగులకు కఠిన చికిత్సల్ని తట్టుకునే శక్తిని యోగా ఇస్తోందనీ, దీనివల్ల మిగతా రోగులతో పోలిస్తే యోగా సాధన చేస్తున్నవారే తొందరగా కోలుకుంటున్నారనీ అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు యోగాను ఆశ్రయించి చక్కని ఫలితాల్ని సాధించినట్టు యేల్‌ యూనివర్సిటీ నిపుణులు నిర్ధరించారు. టైప్‌-2 మధుమేహ పీడితులకు యోగా చాలా ఉపకరించింది.   పార్కిన్సన్స్‌, ఆస్టియో ఆర్థైటిస్‌ వ్యాధి పీడితులకూ యోగా ఉపశమనాన్ని ప్రసాదించినట్టు తేలింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీఎస్‌ఎమ్‌ మెడికల్‌ యూనివర్సిటీ యోగా మీద అనేక పరిశోధనలు చేసి… వూబకాయాన్ని నియంత్రించడంలో యోగాకు తిరుగులేదని గణాంకాలతో సహా నిరూపించింది. కాలేయ, గుండె సమస్యలకూ యోగాలో జవాబు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. యోగసాధకుల్లో డీఎన్‌ఏ చాలా చైతన్యస్థితిలో ఉంటుందనీ, కణాలు ఆరోగ్యంతో తొణికిసలాడుతుంటాయనీ దిల్లీలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ గుర్తించింది.