‘వైకుంఠపాళి’ ఆడుకుంటూ..ఆ సమస్య కు చెక్ చెప్పచ్చు

వైకుంఠపాళి అని ఇప్పుడు సంగతేమో కానీ ఒకప్పుడు మన తెలుగువారికి సుపరిచితమైన ఈ ఆట ప్రపంచ వ్యాప్తంగా రకరకాల పేర్లతో ప్రచారంలో వుంది. ప్రక్కన చూపించిన బొమ్మ పెద్ద కాలండర్ సైజు లో అప్పట్లో సంతల్లో, షాపుల్లో పెట్టి అమ్మేవారు.   బయట పుస్తకాల షాపుల్లో కూడా దొరికేవి. ఈ ఆటను గవ్వలతో ఆడేవాళ్ళు.   వైకుంఠపాళి ఆటనే ఇప్పటి పిల్లలు Snakes & Ladders పేరుతో ఆడుతున్నారు. కానీ  నలుపు, తెలుపు రంగులలో, పెద్దగా, “పరమపద సోపాన పటము” అని రాసిఉండే పాత కాగితం పటమే ఎంతో బాగుంటుంది. ఈ ఆటలో 1 నుంచీ 100 వరకూ అంకెలు, అడ్డువరుసకు 10 గళ్ళ చొప్పున ఉంటాయి. ఈ పటంలో అక్కడక్కడా పాములూ, నిచ్చెనలూ వ్యాపించి ఉంటాయి.    నిచ్చెన ఎక్కడం ద్వారా, నిచ్చెన పై చివర వరకూ చేరుకోవచ్చు. పాములను దాటుకొంటూ, నిచ్చెనలు ఎక్కుకొంటూ, 100వ గడికి ముందుగా చేరుకొన్నవాడే విజేత.  94వ గడినుంచీ   అట్టడుగు వరుస వరకూ వ్యాపించి ఉండే అతి పెద్ద పామును  బారిన పడి ఆటను కోల్పోవటం ఇందులో టెన్షన్ ఎలిమెంట్.  ఈ ఆటలో   పాముల  ఎన్నో దాటుకొని పైకి  రావలసి వుంటుంది.  పాము మింగి క్రిందకు పడిపోతారు. మనజీవితం సత్య పథం లో ప్రయాణించి, పరమపదాన్ని చేరే మార్గానికి ఈ పటం ఒక ‘సూచిక’ గా మనం అన్వయించుకోవచ్చు. 
  ఈ ఆట వల్ల లాభం ఏంటి  ఇంట్లో, వంట్లో, కార్యాలయంలో, దేవాలయంలో ఎక్కడ చూసినా ఒత్తిడి తో కూడిన టెన్షన్ వాతావరణమే. ఈ ఒత్తిడే మెదడును,జీవితాలను నాశనం చేస్తోంది. మతికి మరుపు తెస్తోంది. అందుకు పరిష్కారం పదకేళీ, చదరంగం, సుడోకు , వైకుంఠపాళి వంటి ఆటలు ఆడటమే అని నిపుణులు అంటున్నారు. ఆ ఆటులు మెదడులోని నరాలను ఉత్తేజితం చేస్తాయి. మన టెన్షన్ ని పోగొట్టి మమని తిరిగి దారిలో పెడతాయి. మతి మరుపుకు మంగంళం పాడతాయి. కాబట్టి వెంకుంఠపాళి ఎక్కడుందో వెతకండి..ఆట మొదలెట్టండి.