మన రైల్వేల గురించిన ఈ విశేషాలు..మీరెప్పుడూ విని ఉండరు

అతి పెద్ద పేరున్న రైల్వే స్టేషన్ ..ఆంధ్రప్రదేశ్ లోని వెంకట నరసింహరాజువారి పేటచిన్న పేరున్న రైల్వే స్టేషన్ …ఒడిసా లోని ఐబి, గుజరాత్ లోని ఓడీ స్టేషన్ దేశంలోనే అత్యంత నెమ్మిదిగా ..వెళ్లే ట్రైన్..మెట్టు పాళ్యం-ఊటీ నీలగిరి ప్యాసింజర్ , గంటకు పది కిలోమీటర్లు వేగంతో నడుస్తుంది.దేశంలో అత్యంత వేగంగా నడిచే రైలు …డిల్లీ -భూపాల్ శతాబ్ది ఎక్సప్రెస్ , ఇది గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. భారత్ లో తొలి రైలు 1851 డిసెంబర్ 22న  పట్టాలెక్కింది. రూర్కీలో నిర్మాణ సామగ్రితో అది ప్రయాణించింది.భారత్ రైల్వేకు సుమారు 10.65 లక్షల కోట్ల ఎకరాల సొంత స్దలాలు ఉన్నాయి. భారత్ లో తొలి ప్రయాణీకుల రైలు 1853 ఏప్రిల్ 16న ముంబై నుంచి థానే మధ్య 34 కిలోమీటర్లు నడిచింది. 14 బోగీల్లో 400 మంది ప్రయాణీకులు , మూడు ఇంజన్లతో ముందుకు కెళ్లింది. ఈ ప్రయాణానికి 75 నిముషాలు పట్టింది. తొల ఎలిక్ట్రికల్ రైలు 1925 పిబ్రవరి 3న బోంబే వీటీ, కుర్లా మధ్య నడిచింది. 1872లో ఫస్ట్ క్లాస్ భోగీల్లో ఎయిర్ కూలర్స్ పెట్టారు, 1936లో ఏసీ పెట్టారు. 1874లో రైళ్లలో నాలుగవ తరగతి కోచ్ లు ప్రవేశపెట్టారు. వీటిలో సీట్లు లేవు ట్రైన్లలో టాయిలెట్లు 1891లో తొలి సారిగా  ఫస్ట్ క్లాస్ భోగీల్లో ప్రవేశపెట్టారు. దిగువ తరగతుల్లో 1905లో ఏర్పాటు చేసారు.1952లో లైట్లు , ఫ్యాన్స్ లు అన్ని బోగీల్లో తప్పనిసరి చేసారు
1967లో స్పీపర్ క్లాస్ భోగీలు ప్రారంభించాచరు. 1986లో కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్ద డిల్లీలో మొదలైంది. అత్యథిక దూరం ప్రయాణించే రైలు ..వివేక్ ఎక్సప్రెస్  (4,273 కిలోమీటర్లు)అతి తక్కువ ప్రయాణించే రైలు ..నాగపూర్ నుంచి అజ్ని (మూడు కిలోమీటర్లు) ఎప్పుడూ ఆలస్యంగా నడిచే ట్రైన్..త్రివేండ్రమ్ సెంట్రల్ -గౌహతి ఎక్సప్రెస్. ప్రతీరోజూ ఇది 10 నుంచి 12 గంటలు ఆలస్యంగా నడుస్తుంది.